స్మార్ట్ఫోన్ దూరమైతే రక్తపోటు!
స్మార్ట్ఫోన్ ప్రస్తుతం చాలా మంది శరీరంలో ఇది ఓ ముఖ్యమైన అంగంగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ లేకపోతే చాలామందికి తెల్లారదు. రాత్రి సమయాల్లో నిద్రపట్టదు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ బాధితులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయారని, స్మార్ట్ఫోన్ దూరమైతే పలు వ్యాధుల బారిన పడుతున్నారని ఓ అధ్యనం వెల్లడించింది. స్మార్ట్ఫోన్ బానిసలవుతున్న చాలామందిలో నోమోఫోబియా (స్మార్ట్ఫోన్ దూరమైతే బెంగ పడడం, విచారంగా ఉండడం) లక్షణాలు కనబడుతున్నాయని అమెరికాలోని ఇంటరాక్టివ్ మీడియా సంస్థ చెబుతోంది. స్మార్ట్ఫోన్ దూరమైతే కొంతమందిలో గుండెస్పందనల రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, ఇతర మానసిక సమస్యలకు గురవడం జరుగుతోంది పేర్కొంది.













