డొనాల్డ్ ట్రంప్ కారు ఖరీదు ఎంతో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణించే కారు ఖరీదు 100 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇలాంటి కార్లు ప్రపంచం మొత్తం మీద కేవలం 12 మాత్రమే ఉన్నాయి. ఈ కారు పేరు బీస్ట్. ఈ కారు ఆద్యంతమూ ప్రత్యేకతలతో కూడి వుంటుంది. ఈ కారు బాంబులు, జీవరసాయన దాడులను అడ్డుకుంటుంది. ఈ కారు హెడ్ లైట్స్ వద్ద కెమెరాలు ఉంటాయి. ఇవి పగలు, రాత్రి కూడా సృష్టమైన ఫోటో, వీడియోలు తీయగలవు. ఈ కారు తలుపులు మందం 8 అంగుళాలుంటుంది. దీనికి బోయింగ్-757 విమానాకి ఉండేలాంటి తలుపులే ఉంటాయి. ఇందులో అధ్యక్షుడితో కలిసి నలుగురు కూర్చునే సదుపాయం ఉండగా, ప్రతి వ్యక్తిని వేరు చేస్తూ గ్లాస్ పార్టీషన్ ఉంటుంది. దీనిని కేవలం అధ్యక్షుడు మాత్రమే కిందకు దింపగలడు. ఐదు అంగళాల మందంతో రూపొందించిన అద్దాలను ఈ కారుకు కిటికీలుగా అమర్చారు. ఇవి తుపాకీ బుల్లెట్లను అపగలవు. రెయిన్ ఫోర్స్డ్ స్టీలు పేట్లతో ఈ కారును తయారు చేశారు. దీంతో ఇది బాంబు దాడులను కూడా తట్టుకోగలదు. అత్యవసరంలో వినియోగించే అగ్నిమాపక పరికరాలు అమర్చి ఉంటాయి. ఇందులోని డాష్ బోర్డులో మ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్, ట్రాకింగ్ సిస్టమ్ లు ఉంటాయి. వీటితోపాటు ఈ కారులోనే సెల్ టవర్ కూడా ఉండడం విశేషం.













