మరోసారి వివాదంలో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఐరిస్ జర్నలిస్ట్‌తో ఆయన మాట్లాడిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియా తీవ్రంగా మండిపడుతున్నది. ఐర్లాండ్ కొత్త ప్రధాని లియో వరాద్కర్ను అభినందించడానికి ట్రంప్ ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఆయన ఓవల్ ఆఫీస్‌లో కొందరు జర్మలిస్ట్లు కూడా ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతూనే మీ ఐర్లాండ్‌కు చెందిన బ్యూటీపుల్ జర్నలిస్ట్‌లు ఇక్కడున్నారు అని ఆ దేశ ప్రధానితో ట్రంప్ అన్నారు. అందులో ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్‌ను ట్రంప్ దగ్గరకు పిలిచారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడికి రా అంటూ పిలిచిన ట్రంప్, ఆమె స్మైల్ చాలా బాగుందని, మిమ్మల్ని బాగా చూసుకుంటుందని లియ వరాద్కర్తో ట్రంప్ అన్నారు. అప్పుడు నవ్వుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయినా కైట్రియోనా పెర్రీ అనే ఆ జర్నలిస్ట్, ఆ తర్వాత అదో అసహ్యమైన ఘటన అని ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ట్విట్టర్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.













