ఫిలడెల్ఫియాలో ఘనంగా ధీమ్ తానా పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ నగరాల్లో నిర్వహించిన ధీమ్ తానా పోటీల్లో భాగంగా ఫిలడెల్ఫియాలో మార్చి 25వ తేదీన నిర్వహించిన పోటీలు విజయవంతమయ్యాయి. ఇండియన్ క్రెస్ట్ మిడిల్ స్కూల్ నిర్వహించిన పోటీల్లో దాదాపు 250 మంది పాల్గొన్నారు. 800 మందికిపైగా తెలుగువారు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలకు కో ఆర్డినేటర్లుగా సరోజసాగరం, సతీష్ తుమ్మల వ్యవహరించారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, మను ఆలపాటి గొంది ఈ వేడుకలకు హాజరయ్యారు. గాయనీ గాయకులు ధీరజ్ బర్లా, అదితి భావరాజు తమ పాటలతో అందరినీ మైమరపింపజేశారని తానా నాయకుడు రవి పొట్లూరి తెలిపారు.













