అట్లాంటాలో ఘనంగా ధీం-తానా
ఏప్రిల్ 29న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా, ఆధ్వర్యంలో ధీం-తానా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం, తామా, సహకారంతో దేశానా పాఠశాలలో జరిగిన ఈకార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా హాజరయ్యారు. ఈకార్యక్రమాన్ని తానా తామా కార్యవర్గ సభ్యులు మరియు అట్లాంటా పెద్దలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
.
సంగీత, జానపద, సినీ పాటల పోటీలు, గ్రూప్ డాన్స్ పోటీలు, మరియు మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి. పాటల పోటీలకు ఫణి డొక్కా, శాంతి మేడిచెర్ల, భానుశ్రీ వావిలకొలను, మరియు గీతూ వేణుగోపాల్, నృత్య పోటీలకు శోబియా సుదీప్ మరియు సిద్ కేలం, అలాగే అందాల పోటీలకు మాధవి ఇందుర్తి, రామ్ దుర్వాసుల, మరియు సిద్ కేలం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మధ్యలో అట్లాంటా స్థానిక గాయకులు శ్రీనివాస్ దుర్గం, వెంకట్ చెన్నుభొట్ల, భానుశ్రీ వావిలకొలను, రామ్ దుర్వాసల, మరియు జనార్ధన్ పన్నెల తమ పాటలతో ఉర్రూతలూగించారు.
.
తదనంతరం తానా అధ్యక్షులు డాక్టర్ చౌదరి జంపాల పాటల పోటీల విజేతలకు, న్యాయ నిర్ణేతలు నృత్య పోటీల విజేతలకు పతకాలు అందజేశారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన మహిళా పెద్దలు మిస్ టీన్ తానా, మిస్ తానా, మరియు మిసెస్ తానా విజేతలకు క్రౌన్ మరియు శాశ్ బహుకరించారు. అలాగే తానా అధ్యక్షులు డాక్టర్ చౌదరి జంపాల గారు ధీం-తానా కార్యక్రమానికి సహకరించిన స్థానిక అట్లాంటా తెలుగు సంఘం, తామా, కార్యవర్గం మరియు తానా యాడ్ హాక్ కమిటీ వాలంటీర్లకు జ్ఞాపికలను అందించారు. ఈసందర్భంగా తానా అధ్యక్షులు డాక్టర్ చౌదరి జంపాల గారు సభనుద్దేశించి ప్రసంగించగా, అట్లాంటా తానా నాయకత్వం అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, మరియు అనిల్ యలమంచిలి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. గత నెలలో క్యూరీ మరియు తానా సంయుక్తంగా నిర్వహించిన మాత్ బౌల్ మరియు స్పెల్ మాస్టర్ పోటీల విజేతలకు అట్లాంటా పెద్దల చేతులమీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. చివరిగా నీలిమ గడ్డమనుగు, మాధవి కొర్రపాటి, మరియు మాలతి నాగభైరవ గార్లను ధీం-తానా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు కొనియాడి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
.
చివరిగా తానా కెరీర్ అసిస్టెన్స్ యాడ్ హాక్ కమిటీ కోచైర్పర్సన్ వెంకీ గద్దె మాట్లాడుతూ అట్లాంటా ధీం-తానా ప్లాటినం స్పాన్సర్స్ తానా కమ్యూనిటీ సర్వీసెస్ సమన్వయకర్త అంజయ్య చౌదరి లావు, తానా దక్షిణ తూర్పు సమన్వయకర్త అనిల్ యలమంచిలి, డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధినేత మరియు తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, మరియు గోల్డ్ స్పాన్సర్స్ డివినిటీ ఆడియో అధినేత జోజి, కార్యక్రమాన్నంతటిని తన కెమేరాలో చక్కగా బంధించిన ఫోటోగ్రాఫర్ రావు జివి, రుచికరమైన భోజనాలు అందించిన హాట్ బ్రెడ్స్ యాజమాన్యం, చక్కని ఈవెంట్ ప్లానింగ్ తో స్టేజిని అలంకరించిన క్రియేటివ్ కస్టమ్స్ అధినేత మాధవి కొర్రపాటి, కోహోస్టుగా వ్యహరించి సహాయసహకారాలందినించిన తామా సభ్యులు నగేష్ దొడ్డాక, సుబ్బారావు మద్దాళి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, వినయ్ మద్దినేని, శ్రీహర్ష యెర్నేని, ఇన్నయ్య ఎనుముల, మురళి బొడ్డు, భరత్ మద్దినేని, ఆదిత్య గాలి, ప్రియా బలుసు, కార్యక్రమాన్నంతటిని ప్రత్యక్ష ప్రసారం చేసిన టీవీ5 మరియు మనటీవీ యాజమాన్యం, దేశానా పాఠశాల యాజమాన్యం, వాలంటీర్స్ భరత్ అవిర్నేని, రాజేష్ జంపాల, శ్రీనివాస్ నిమ్మగడ్డ, వెంకట్ అడుసుమిల్లి, విజయ్ కొత్తపల్లి, న్యాయ నిర్ణేతలు, మరియు ధీం-తానా కార్యక్రమానికి విచ్చేసి కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేయగా, భారత జాతీయగీతం జనగణమనతో కార్యక్రమం ముగిసింది.













