అలరించిన లాస్యం! అద్భుత తాండవం!!
డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి నాట్స్ తెలుగు సంబరాల్లో ప్రదర్శించిన “శంకరా నాద శరీరపరా – ఆనంద తాండవమాడే” నృత్యం ఆహుతుల్ని విశేషంగా ఆకర్షించింది. డాక్టర్ రమణ చక్కనైన నృత్య రచనకి, శ్రీమతి చంద్ర ప్రభ చిక్కనైన హావభావాలు, శ్రీ రాజశేఖర్ చెన్నం సమకూర్చిన గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాట్స్ వారి తెలుగు సంబరాల్లో 3వ రోజున ఆదివారం అమెరికా టేనస్సీ రాష్ట్రం, కార్డోవ పట్టణంలోని ఇండియన్ బాలే థియేటర్లో నృత్యం నేర్చుకుంటున్న చిన్నారులు అశ్విక బండారు, వైష్ణవి పిల్లి, అస్మిత బొద్దు, శాన్వి కుంటమల్ల మరియు నిధి నిహారిక చెన్నం “అదివో అల్లదివో శ్రీ హరి వాసము, కొలని దోపరికి గొబ్బిళ్ళో, ఎంతో రుచిరా” మొదలైన అన్నమాచార్య, రామదాసు కీర్తనలు హృద్యమంగా డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ నేతృత్వంలో ప్రదర్శించారు.
Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
901-387-9646
[email protected]








