ఉప్పు తగ్గిస్తే… బీపీ తగ్గదు!
ఉప్పు వాడకం తగ్గిస్తే రక్త పోటు కూడా తగ్గుతుందని చాలాకాలంగా ఉన్న నమ్మకం. అయితే ఇది నిజం కాదని తాజా పరిశోధన తేల్చింది. 2,632 మంది వలంటీర్లను పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు బోస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ రక్తపోటుతో ఉన్న వలంటీర్లలో కొంతమందికి రోజుకు 2500 మిల్లీగ్రామలు, మరికొంతమందికి ఇంకా ఎక్కువగా ఉప్పును ఆహార పదార్థాలతో అందజేశామన్నారు. అయితే, రోజు పెద్దమొత్తంలో ఉప్పును స్వీకరించిన వారితో పోలిస్తే 2500 మిల్లీగ్రాములు తీసుకున్న వారిలోనే రక్తపోటు ఎక్కువగా ఉందని చెప్పారు. రోజుకు 3717 మిల్లీ గ్రాముల ఉప్పు తీసుకున్నవారిలో బీపీ తక్కువగా ఉందన్నారు.













