ఓహియోలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
సహజ వనరులు ఉన్నందున దశాబ్దిలోగా తెలంగాణ పరిశ్రమల హబ్‌గా అవతరిస్తున్నదని రవాణాశాఖ మంత్రి పీ.మహేందర్ రెడ్డి అన్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కొలంబస్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, తెలుగుదేశం తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు బి.శోభరాణి, ఆటా అధ్యక్షుడు ఆశిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నాయకులు దయాకర్‌రెడ్డి, అనీల్, టీడీఎఫ్ అధ్యక్షుడు కల్వల విశ్వేర్వర్రెడ్డి, నాయకులు భీంరెడ్డి పరమేశ్వర్‌రెడ్డి, బోర్డు సభ్యులు మహేశ్, అమర్, అశోక్, శ్రీధర్, శ్రీకాంత్, అనీల్, ఆకుల శ్రీనివాస్, కాసర్ల రమకృష్ణ, పోకల మనోజ్, నవీన్, కాసర్ల రాము, ప్రమోద్, రఘు పాల్గొన్నారు.













