పరిశ్రమల హబ్ గా తెలంగాణ
కొలంబస్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సహజ వనరులు ఉన్నందున దశాబ్దిలోగా తెలంగాణ పరిశ్రమల హబ్‌గా అవతరిస్తున్నదని మహేందర్‌రెడ్డి అన్నారు. . ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు బీ శోభారాణి, ఆటా అధ్యక్షుడు ఆశిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నాయకులు దయాకర్‌రెడ్డి, అనీల్, టీడీఎఫ్ అధ్యక్షుడు కల్వల విశ్వేశ్వర్‌రెడ్డి, నాయకులు భీంరెడ్డి పరమేశ్వర్‌రెడ్డి, బోర్డు సభ్యులు మహేశ్, అమర్, అశోక్, శ్రీధర్, శ్రీకాంత్, అనీల్, ఆకుల శ్రీనివాస్, కాసర్ల రామకృష్ణ, పోకల మనోజ్, నవీన్, కాసర్ల రాము, ప్రమోద్, రఘు పాల్గొన్నారు.













