చికాగోలో సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు
అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేస్తున్న నాట్స్.. చికాగోలో ఉగాది ఉత్సవాలను ఇదే రోజు సాయంత్రం ఘనంగా నిర్వహించింది. చికాగోలోని స్థానిక తెలుగు సంఘం సీటీఏతో కలిసి ఈ వేడుకలు జరిపింది. హేమళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగువారంతా ఇక్కడ చేరి సంబరాలు జరుపుకున్నారు.. తెలుగు కళా సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇక్కడ స్థానిక అరోరా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేడుకలు జరిగాయి..స్థానికంగా తెలుగు కళకారులు ఈ ఉగాది ఉత్సవాల కోసం ఎంతో సన్నద్దమై ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు ఆట, తెలుగు పాట.. ఉగాది సంబరాల్లో ప్రతిబింబించాయి.. సీటీఏ, నాట్స్ ప్రతనిధులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ప్రదర్శనలు ఇచ్చిన కళకారులను… ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్లను నాట్స్, సీటీఏ ప్రత్యేకంగా అభినందించాయి. విజేతలకు బహుమతులను అందచేశారు.













