ఐయోవాలోని ఇండియా హెరిటేజ్ కల్చరల్ సెంటర్ లో ‘‘కళా ఉత్సవ్ 2026’’
ఐయోవాలోని ఇండో-అమెరికన్ అసోసియేషన్, భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో, ఐయోవాలోని ఇండియా హెరిటేజ్ కల్చరల్ సెంటర్ (IHCC)లో కళా ఉత్సవ్ 2026 నిర్వహించింది.ఈ కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద నృత్యాలను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలతో భారతీయత అక్కడ వుట్టి పడింది. వీటితో పాటు వాద్య సంగీత కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. దీని ద్వారా భారత దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమాలు సాగాయి. కళాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనలిచ్చారు.

ఈ కళా ఉత్సవల్ లో కాన్సుల్ జనరల్ ఆనంద్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్, యూఎస్ మధ్య వున్న శాశ్వతమైన సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సమావేశానికి ఎన్నికైన అధికారులు మరియు సమాజ సభ్యులు హాజరయ్యారు. భారతదేశపు వైవిధ్యం మరియు సంప్రదాయాల యొక్క ఈ ఉత్సాహభరితమైన వేడుకను వారంతా ఆస్వాదించారు.









