వీసా ఆంక్షల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోండి
వీసా జారీకి సంబంధించిన ఆరు ముస్లిం ఆధిక్య దేశాలపై విధించిన ఆంక్షల్లో చేసిన స్వల్పమార్పులను వెంటనే పరిగణలోకి తీసుకోవాలని అమెరికా విదేశాంగశాఖ తమ దౌత్య కార్యాలయాలను ఆదేశించింది. అమెరికా పౌరులతో దగ్గరి బంధుత్వం ఉన్నవారికే వీసాలు మంజూరు చేసేలా ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం నిబంధన తెచ్చిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, సంతానం, తోబుట్టువులు, అల్లుళ్లు, కోడళ్లకు మాత్రమే ఈ దగ్గరి బంధువుల జాబితాలో స్థానం కల్పించింది. అయితే తాజాగా దీన్ని విస్తృతిని ఆ దేశ విదేశాంగ శాఖ పెంచింది. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, జీవిత భాగస్వాముల తోబుట్టువులతోపాటు మరికొన్ని బంధుత్వాలను చేర్చింది. గత వారం హవాయి ఫెడరల్ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ తాజా చర్యలు చేపట్టింది.













