సెకన్లలో ఫోన్ చార్జింగ్
స్మార్ట్‌ఫోన్ లేనిదే పొద్దుగడవదు. అయితే, దానికి ఉన్న సమస్యల్లా చార్జింగ్. ఒకసారి చార్జింగ్ పెడితే బ్యాటరీ పుల్ కావడానికి కనీసం గంట పడుతుంది. అదే అనుకోకుండా ఏదైనా పని పడి బయటికి వెళ్లాలంటే ఫోన్ కచ్చితంగా అవసరమైతే ఆ కష్టాలు మనకు తెలియనివి కావు. ఆ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అత్యంత వాహక మెక్సెన్ పదార్థంతో సరికొత్త ఎలక్ట్రోడ్‌ను డిజైన్‌ను అభివృద్ధి చేశారు. దీని సాయంతో సెకన్లలో మన ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చట. అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ ఎలక్ట్రోడ్‌ను రూపొందించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం.













