శరీర భాషను చదివే కంప్యూటర్
శరీర అవయవ చలనాన్ని అర్థం చేసుకునే సరికొత్త కంప్యూటర్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనిషితో తొందరగా అనుసంధానం అయ్యేసామర్థ్యం ఈ కంప్యూటర్ వ్వవస్థకు ఉందని అమెరికాలోని పిట్స్బర్గ్లో ఉన్న కర్నెగీ మెలాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్డుపై వెళ్తున్నపుడు పాదాచారులు అనుకోకుండా అడ్డంగా వచ్చినట్లైతే వారి శరీర భాషలను అర్థం చేసుకుని సందర్భానుసారంగా వ్యవహరించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు.








