అమెరికాపై కాగ్నిజెంట్ దృష్టి
ప్రముఖ బహుళ జాతి ఐటి సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్1బి వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అమెరికాలో స్థానికంగా 8000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. అలాగే మరో ఏడు సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.








