9 నెలల అడ్వాన్స్ శాలరీ తీసుకోండి.. రిజైన్ చేసి వెళ్లిపోండి…
ఐటి కంపెనీ కాగ్నిజెంట్ తమ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 9 నెలల శాలరీ తీసుకొని తమ జాబ్స్ కు రిజైన్ చేయాలని కోరింది.
తమ ఇన్వెస్టర్ నుంచి వస్తున్న ఒత్తడి, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీలను ఆడాప్ట్ చేసుకోవడం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న కాగ్నిజెంట్.. కంపెనీలోని డైరెక్టర్స్, సీనియర్ లేవల్ ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి నిశ్చయించుకుందట.
అందులో భాగంగానే ఉద్యోగులకు వాలంటరీ రాజీనామా గురించి మెయిల్ పంపించిందట. కొంతమంది ఉద్యోగులకు 6 నెలల శాలరీ, మరికొంతమందికి 9 నెలల శాలరీ ఇవ్వడానికి రెడీ గా ఉందట కంపెనీ. అఫీషియల్ గా ఎంతమందికి ఈ బంపర్ ఆఫర్ ఇవ్వనుందో కంపెనీ తెలియజేయనప్పటికీ… డి ప్లస్ కాటగిరీ లోకి వచ్చే ఎంప్లాయిస్ కు స్పష్టంగా మెయిల్ పంపించిందట. ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం మ్యాన్ పవర్ వర్క్ మినిమైజ్ అవడంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికే మొగ్గు చూపుతున్నాయి.








