కొబ్బరి నూనె కూడా అనారోగ్యకరమే!
కొబ్బరి నూనె అనారోగ్యకరమంటూ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. జంతు సంబంధిత కొవ్వులు, వెన్నలాలే ఇది కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏఎస్ఏ) నిపుణులు దీన్ని చేపట్టారు. సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ధమనుల్లో రక్త సరఫరాకు అవరోధం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె పోటుతో పాటు పక్షపాతం ముప్పూ పెరుగుతుంది. కొబ్బరి నూనెలోని కొవ్వుల్లో 82 శాతం వరకూ సంతృప్త కొవ్వులే ఉన్నట్లు ప్రస్తుతం పరిశోధకులు గుర్తించారు. దీంతో వెన్న (63శాతం), గోమాంసం (50 శాతం), పంది మాసం (39 శాతం)ల కంటే దీనిలోనే సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కొబ్బరి నూనెకు బదులు పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనెలను తీసుకోవడం మేలని పరిశోధకులు ఫ్రాంక్ సాక్స్ వివరించారు.













