అమెరికాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో జరపనున్న పర్యటనను విజయవంతం చేయడానికి ఎన్ఆర్ఐ-టీడీపీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. యూఎస్ వెల్కమ్స్ సీబీఎన్ అంటూ పోస్టర్లు రూపొందించి, ఆంధ్రులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నామని ఎన్ఆర్ఐ-జన్మభూమి కమిటీ సమన్వయకర్త లెక్కల వెంకటేశ్వరరావు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి బ్రోచర్లు రూపొందిస్తున్నామన్నారు. వచ్చే నెల 6న టెక్సాస్‌లో, ఏడున కాలిఫోర్నియాలో చంద్రబాబు ప్రవాసాంధ్రులతో సమావేశమవుతారని తెలిపారు. అమరావతి నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని వివరిస్తారన్నారు.













