స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్తగా ఉండాలి
మీరు స్మార్ట్ ఫోన్లను విపరీతంగా వినియోగిస్తారా. అది లేకపోతే క్షణం గడవదేమో అన్నట్టుగా ఉంటున్నారా. ఇలా ఉండడం మీకు తాత్కాలికంగా ఆనందం కలిగించవచ్చు. అయితే మున్ముందు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులను దారితీయొచ్చని, తస్మాత్ జాగ్రత్తాగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లకు భానిసలుగా మారితే అది వారి పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని, వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులకు హేతువవుతుందని అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన సునిశితత్వం, అంతలోనే తీవ్ర ఆగ్రహానికి లోనవడం వంటి చెడు లక్షణాలు వారిలో జనిస్తాయని చెబుతున్నారు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, లాప్టాప్లు వంటి వాటిని వినియోగిస్తుండడం వల్ల కుటుంబసభ్యులతో గడిపే సమయం బాగా తగ్గిపోతుందని, ఇది కుటుంబసభ్యులకు ఇబ్బందికరంగా పరిణమిస్తుందని చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల తరచూ దృష్టి పక్కదారి పట్టిందనే విషయాన్ని ఎవరికి వారు పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.








