న్యూయార్క్లో బాల్య వివాహాలు నిషేధం
అమెరికాలో పధ్నాలుగు సంవత్సరాలకే పెళ్ళికి అనుమతి ఇచ్చే చట్టం అమలులో ఉంది. 2000 నుంచి 2010 సంవత్సరం వరకూ పదేళ్ళలో 1,70,000 బాల వివాహాలు జరిగినట్లు రాయటర్ వార్త సంస్థ పేర్కొంది. అదే సందర్భంలో న్యూయార్క్ రాష్ట్రంలో బాల్య వివాహాలపై నిషేధం ఉంది. ఈ పదేళ్ళ కాలంలో ఆ రాష్ట్రంలో 3,800 బాల్య వివాహాలు మాత్రమే జరిగాయి. న్యూయార్క్ రాష్ట్రంలో బాల్యవివాహాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది చరిత్రాత్మకమైనదిగా సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు అభివర్ణించారు. బాల్యవివాహాలను నిషేదించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యు మో సంతకం చేశారు. మన దేశంలో చట్ట ప్రకారం 18 ఏళ్ల యువతులు మాత్రమే వివాహాలకు అర్హులు.








