చికాగో ఆంధ్ర సంఘం వారి వనభోజనాల సందడి
ఆరేళ్ళ పిల్లల దగ్గర నుంచి ఆరవయేళ్ల పైపడిన వారి వరకు ఈ ఆటపాటల్లో పాల్గోవడం ఆందరిని విస్మయానికి గురిచేసింది, ఆంధ్ర సంఘం వారు అరటి ఆకులలో భోజనాలు వడించటం వారి ప్రత్యేకత ఆంధ్ర వంటకాలు రుచులతో ఇక విందు భోజనాలు సరే సరి. చికాగో ప్రాంతము లో ఉన్న అన్ని తెలుగు సంఘాల వారు వచ్చి వారి ఐక్యతని చాటుకున్నారు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు చికాగో ఆంధ్ర సంఘం అద్యక్షుడు సుందర్ దిట్ఠకవి విచ్చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు తెలియచేసారు.








