CAA: చికాగో ఆంధ్ర సంఘం దశాబ్ది వేడుకలు
CAA: చికాగో ఆంధ్ర సంఘం (CAA) పదేళ్ల మైలురాయిని పురస్కరించుకుని 2016-2026 దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో భాగంగా ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలను ఖరారు చేశారు.
కార్యక్రమ షెడ్యూల్:
ఏప్రిల్ 11 (శనివారం): ఉదయం 9:00 గంటలకు అరోరాలోని శ్రీ బాలాజీ టెంపుల్, సుబ్బయ్య హాల్ లో ‘శ్రీ సీతారామ కళ్యాణోత్సవము’ జరుగుతుంది.
ఏప్రిల్ 12 (ఆదివారం): మధ్యాహ్నం 1:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు బోలింగ్బ్రూక్ హైస్కూల్లో ‘దశాబ్ది ఉత్సవాల’ ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు.
నిర్వాహక బృందం:
ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు చికాగో ఆంధ్ర సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా,
- రాఘవ జట్ల (ఛైర్మన్)
- తమిశ్ర కొంచాడ (ప్రెసిడెంట్)
- రామకృష్ణ తాడేపల్లి (వైస్ ప్రెసిడెంట్)
- నరసింహా రెడ్డి ఒగ్గు (సెక్రటరీ), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ట్రస్టీలు ఈ కార్యక్రమ పర్యవేక్షణలో పాల్గొంటున్నారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకల్లో పాల్గొనే వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. మరిన్ని వివరాలకు www.chicagoandhra.org వెబ్సైట్ను చూడవచ్చు.








