చందాకొచ్చర్ కు ఉడ్రోవిల్సన్ అవార్డు
ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచ్చర్ వాషింగ్టన్లో ఉడ్రోవిల్సన్ అవార్డును స్వీకరించారు. గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్షిప్నకుగానూ వాషింగ్టన్‌లోని ఉడ్రోవిల్సన్ సెంటర్ ఈ అవార్డును బహుకరిస్తుంది. ప్రజా జీవితాలను మెరుగుపర్చడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. భారత్ గౌరవార్థం నేను ఈ అవార్డును స్వీకరిస్తున్నా, ఈ ఘనత మొత్తం మహిళలకు, ఐసీఐసీఐ గ్రూప్‌నకు చెందుతుంది.








