గంజాయితో కేన్సర్ ప్రమాదం
గంజాయి కషాయం, ఆవిరిలో కేన్సర్ కారక రసాయనాలు అధిక మోతాదులో ఉన్నట్టు ఓ పరిశోధనలో తేలింది. గంజాయిని అమెరికాలోని ఔషధ రంగంలోనూ, నూనెల తయారీలోనూ వాడుతున్నారు. అందులో భాగంగా గంజాయిని చూర్ణం చేయడం, ఆవిరి చేయడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియల వల్ల గంజాయి నుంచి బెంజీన్, ఇతర ప్రమాదకర కేన్సర్ కారక రసాయనాలు విడుదలవుతున్నాయని అమెరికా లోని పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. గంజాయి పొగ వల హానికర విష వాయువులు విడుదలవుతున్నాయని చెప్పారు. ఇక ఈ సిగరెట్లలో గంజాయి నుంచి తీసిన టెర్పీన్స్ను ఉపయోగిస్తున్నారని, అవి అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు.













