పెన్నుతో కేన్సర్ గుర్తింపు
కేన్సర్ ఇప్పటిదాకా ఈ మహమ్మారి కచ్చితత్వాన్ని గుర్తించే పరికరాలు ఉన్నా వ్యాధి కణాలను గుర్తించేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కేవలం 10 సెకన్లలో కేన్సర్ కణాలను గుర్తించే పెన్ను లాంటి పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది శస్త్రచికిత్స సమయంలో 96శాతం కచ్చితత్వంతో కణాలను గుర్తించి ఫలితాలను ఇస్తుందట. మాస్ స్పెక్ అనే ఈ డిస్పోజబుల్ పరికరం సాయంతో ఏ కణజాలాన్ని తొలగించాలి, దేన్ని కాపాడాలన్న సృష్టమైన సమాచారం వైద్యులు తెలుసుకోవచ్చట. కేన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించి వ్యాధిని పునరావృతం కాకుండా చేయటంలో ఈ పెన్ను దోహదం చేస్తుందని, సాధారణ పరికరాల, సాధారణ పరికరాల కంటే 150 రెట్లు వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.













