బట్టతలకు…. మరో కొత్త కారణం
జట్టు రాలడం కొద్దికొద్దిగా మొదలై చివరకు బట్టతలకు దారితీస్తుంది. అసలు బట్టతల ఎందుకు వస్తుందనే విషయంపై ఇప్పటికే రకరకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మరో కాత్త కారణాన్ని కనుగొన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇది భవిష్యత్తులో జట్టు రాలకుండా రక్షించే చికిత్సల అభివృద్ధికి తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు. రోగనిరోధక వ్యవస్థలోని టి సెల్స్ శరీరంలో అంతర్గత వాపునకు దారితీసే పరిస్థితిని అడ్డుకుంటాయి. ఇవి మూలకణాలతో కలిసి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయి.








