రెండు కిలోమీటర్ల పిజ్జా…
ఒకరికో ఇద్దరికో లేదంటే ఓ కుటుంబానికో సరిపోయే పిజ్జా గురించి విన్నాం. ఏకంగా ఓ ఊరంతటికీ సరిపోయే పిజ్జా గురించి విన్నారా? ఊరందరికీ సరిపోవాలంటే ఆ పిజ్జా ఎంత పెద్దదై ఉండాలని ఆలోచిస్తున్నారు కదూ? నిజమే అది ఎంత పెద్దదంటే, దీని పొడవు కొలవడానికి ఓ బైక్‌పైనో, కారుపైనో వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ పిజ్జా పొడవు రెండు కిలోమీటర్లు మరీ. కాలిఫోర్నియాలోని ఆటోక్లబ్ స్పీడ్‌వేలో, డజన్ల మంది చెఫ్‌లు, వందల మంది ఔత్సాహికులు కలిసి ఈ పిజ్జాను తయారు చేశారు. ఇంతభారీ ప్రయత్నాన్ని వీరంతా ఎందుకు చేశారంటే, కేవలం గిన్నిస్ బుక్క్లోకి ఎక్కేందుకేనట. 2016లో ఇటలీలో తయారు చేసిన 6,082 అడుగుల పొడవు గల పిజ్జా గిన్నిస్ బుక్‌లోకి ఆల్రెడీ తిష్టవేసుకోగా, తాజాగా 6,333 అడుగుల పొడవు (1.93 కిలోమీటర్లు), 7,808 కిలోల బరువుగల లాస్ఏంజిలెస్ పిజ్జా దాని స్థానాన్ని ఆక్రమించింది.








