ఎవరెస్టుపై అమెరికా జంట పెళ్లి!
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జేమ్స్ (35), అష్లే(32) పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వారి అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని అనుకున్నారు. అందుకోసం సంవత్సరకాలంగా ప్రణాళికలు వేసుకొని చివరికి ప్రపంచంలోనై ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పర్వతారోహణకు సంబంధించి కొంత కాలంపాటు శిక్షణ తీసుకున్నారు. మూడు వారాల పాటు సాగిన వారి పర్వతారోహణలో జేమ్స్, అష్లేతో పాటు ప్రఖ్యాత అడ్వెంచర్ ఫొటోగ్రాఫర్ ఛార్లెటన్ చర్చిల్‌ను వాళ్లతో పాటు తీసుకెళ్లారు. మంచును దాటుకుంటూ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దాదాపు మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో సముద్ర మట్టానికి 14వేల అడుగుల ఎత్తులో మార్చి 16న ఆ జంట ఒక్కటైంది. ఇందులో మరో విశేషమేంటంటే జేమ్స్, అష్లే అందమైన పెళ్లి దుస్తుల్లోనే ఎవరెస్టును అధిరోహించారు. శిఖరాధిరోహణ సమయంలోని ప్రతీ అద్భుతమైన మూమెంట్‌ను ఛార్లెటన్ తన కెమెరాలో బంధించారు.













