డొనాల్డ్ ట్రంప్‌కు మెట్లంటే భయమట!
అందర్నీ హడలెత్తిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం మెట్లెక్కడమంటే చాలా భయం. దీంతో ఆయన విదేశీ పర్యటనల్లో మెట్లెక్కే పరిస్థితులు తలెత్తకుండా అధికారులు తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించనున్నారు. బకింగ్హోమ్ రాజభవనంలో ఎలిజిబెత్ రాణి ఇచ్చే విందుకు హాజరుకావడంతో పాటు రాణి స్కాటిష్ విడిది కేంద్రం బాల్మోరల్ రాజభవనాన్నీ సందర్శిస్తారు. అక్కడ మెట్లెక్కడం తప్పనిసరైతే ఏం చేయాలన్న దానిపై అమెరికా అధికారులు తర్జనభర్జన చేస్తున్నారు. ట్రంప్ నడిచే ప్రాంతంలో మెట్లెక్కే పరిస్థితి లేకండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే కింది అంతస్తులోనే వేదిక ఏర్పాటు చేయడంతో పాటు, ట్రంప్ నడిచే దారిలో మెట్ల అవసరం లేకుండా లేర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.








