తల్లిపాలతో రొమ్ము క్యాన్సర్ గుర్తింపు
రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పాలలోని ప్రోటీన్ మార్కర్లను పరీక్షించడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్దారించొచ్చని కనిపెట్టారు. ప్రస్తుతం స్కానింగ్, మమోగ్రఫీ తదితర పద్ధతుల్లో ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. అయితే వ్యాధి తొలి దశల్లో వీటి ప్రభావం అంతంత మాత్రమే. పైగా వీటిలో వ్యాధి ముప్పు తెలిసే వీలులేదు. దీంతో అమెరికాలోని మస్సాచుసెట్స్ వర్సిటీ నిపుణులు తాజా పరిశోధన చేపట్టారు. పాలు, కన్నీరు. మూత్రం, ఉమ్ము తదితర శారీరక ద్రవాలపై వారు దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల పాలను, క్యాన్సర్‌లోని మహిళల పాలతో పోల్చినప్పుడు, భిన్న ప్రోటీన్ మార్కర్లను గుర్తించారు. వీటిని విశ్లేషించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తొలినాళ్లలోనే గుర్తించొచ్చని వారు తెలిపారు. ఈ విధానం ఎంతో సురక్షితమైనదని, చక్కని ఫలితాలను ఇస్తుందన్నారు.








