రెండు గంటలు కాదు… రెండు నిమిషాల్లోనే ఆపరేషన్!
అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లను సునాయాసంగా పూర్తిచేసే యంత్రాన్ని యూటా వర్సిటీకి చెందిన నిపుణులు రూపొందించారు. కంటి శుక్లాల శస్త్రచికిత్సలో ముందుగా న్యూరో సర్జికల్ ప్రక్రియకు 2 గంటలు పడుతుంది. ఆ తర్వాత చికిత్స మొదలవుతుంది. ఈ యంత్రం 2 నిమిషాల్లోనే శస్త్రచికిత్స పూర్వ ప్రక్రియను పూర్తి చేసేస్తుందట. సీటీస్కాన్ ద్వారా రోగి ఎముకలు, నాడీ వ్యవస్థను చిత్రీకరిస్తాం. ఆ వివరాల అధారంగా శస్త్రచికిత్సను పూర్తిచేయడానికి సాఫ్ట్వేర్ను రాస్తాం. దాని ప్రకారం యంత్రం పని పూర్తిచేస్తుంది అని ప్రొఫెసర్ ఏకే బాలాజీ వివరించారు.













