మజుందార్‌షాకు అరుదైన గుర్తింపు
బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కెక్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల్లో అమె ఒకరిగా ఎంపికయ్యారు. బయోటెక్నాలజీ, ఫార్మాసీ విద్యాబోధనలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ 26 మందితో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రగామి బయోసైన్స్, హెల్త్‌కేర్, విద్యావిభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూసిన వారికి అవకాశం ఇవ్వగా అందులో కిరణ్ మజుందార్ షా ఒకరని బయోకాన్ సంస్థ ప్రతినిధుల తెలిపారు.








