టీనేజ్ లో తాగుడు మెదడుకు చేటు
యువతీ, యువకులారా ఒక్క నిమిషం. పార్టీల్లో, పబ్బుల్లో ఆనందంలో విపరీతంగా తాగేస్తున్నారా? టీనేజ్ లో ఉండగా ఎక్కువగా మద్యం సేవిస్తే మెదడు మొద్దుబారుతుందట. తాగుడు అలవాటు ఉన్నవారిలో జ్ఞాపశక్తి, శ్రద్ధాసక్తులు, భాషకు సంబంధించిన మెదడులోని భాగం కుచించుకుపోతుందట. దీంతో భవిష్యత్తులో మతిమరుపు రుగ్మతలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని అమెరికాలోని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టీనేజ్ దశలో జీవ సంబంధంగానే కాకుండా మానసికంగానూ మెదడు పరిణితి సాధిస్తుందని, ఆ దశలో మధ్యం సేవిస్తే న్యూరాన్లపై చెడు ప్రభావం చూపుతుందని వెల్లడించారు.













