అవుట్ సోర్సింగ్ కంపెనీల అడ్డుకట్టకు మరో బిల్లు
భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే బిల్లును ‘కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్’కింద డెమోక్రటిక్ సభ్యుడు డెరెక్ కిల్మెర్, రిపబ్లికన్ సభ్యుడు డౌగ్ కొలిన్స్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాలను దుర్వినియోగపరుస్తూ విదేశీయులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు తెరపైకి వచ్చింది. హెచ్1బీప్రోగ్రామ్ ద్వారా తాత్కాలిక వీసాలు పొందుతూ అమెరికాకు వస్తున్న విదేశీ ఉద్యోగులను నియంత్రించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలు దేశం దాటిపోకుండా ఉంటాయని కొలిన్స్ తెలిపారు.













