హెచ్-1బీ వీసాలపై మరో బిల్లు
హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా విదేశీయులను పొరుగు సేవల ఉద్యోగాల్లో నియమించుకోకుండా అమెరికా సంస్థలను నిలువరించే ఓ బిల్లు ఆ దేశ ప్రతినిధుల సభలో మరోసారి ప్రవేశించింది. భారతీయ ఐటీ సంస్థలు, నిపుణులపై ప్రభావం చూపే అవకాశమున్న ఈ బిల్లును, డెమోక్రటిక్ సభ్యుడు డెరెక్ కిల్మర్, రిపబ్లికన్ నేత డగ్ కొలిన్స్ ప్రవేశపెట్టారు. అమెరికా ఆర్థిక వ్వవస్థ బలోపేతం కావాలంటే, దేశ పౌరుల ఉద్యోగాలను పరిరక్షించడం ప్రస్తుతం అత్యంత కీలకమని కొలిన్స్ పేర్కొన్నారు. వాస్తవానికి నిపుణులైన అమెరికా పౌరులు అందుబాటులో లేనిపక్షంలో మాత్రమే విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకునేందుకు హెచ్-1బీ వీసాలు అమెరికా సంస్థలకు అవకాశమిస్తాయని సూచించారు. కానీ, దాన్ని దుర్వినియోగం చేస్తూ పలు సంస్థలు అమెరికా పౌరులు తప్పించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.













