22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
శ్రీ హేవళంబ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 28, 2017) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 22వఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికేపరిమితమైన ఈ పోటీలో అమెరికా, ఆస్ట్రేలియా. మధ్య ప్రాచ్య దేశాలు, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల నుంచి తగిన సంఖ్యలోఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం ముదావహం. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసినరచయితలకు మా ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైనఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగాప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం – 22వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“శరణం గచ్ఛామి”- సత్యం మందపాటి (ఆస్టిన్) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“మొగమాటస్థుని డైరీ నుండి”- గరిమెళ్ళ నారాయణ (Herndon, VA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“గుర్తింపు”- నిర్మలాదిత్య (Tampa, FL) (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“అతడిని నాకు తెలుసు” – డా. గరిమెళ్ళ నారాయణ (Hendon, VA): ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“వెలితి” – పన్నాల రఘురాం – Rokokoma, NY ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“అద్వైతం” – డా. జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్) (ప్రశంసా పత్రం)
“మొగలి రేకులు” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) (ప్రశంసా పత్రం)
================================================
“మొట్టమొదటి రచనా విభాగం” -8వ సారి పోటీ
“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“నవ సంవత్సరాగమనం” – నేమాని సోమయాజులు(Atlanta, GA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“హంపీ వైభవం”- శ్రద్ధ కొమాండూరి (Harrisburg, PA) (ప్రశంసా పత్రం)
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
“గోంగూర పురాణం” – ఉమా (వెంకట్ నాగం) (Sacramento, CA): ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఆ నవ్వుకి అర్థం అదా?” – శ్రీకాంత్ విహారి (Edison, NJ): ప్రశంసా పత్రం
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు)
శాయి రాచకొండ (సంపాదకులు)
E-mail: vangurifoundation@gmail.com













