న్యూయార్క్, మిన్నెసోటాలో బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబరాలను అమెరికాలోని న్యూయార్క్, మిన్నెసోటా నగరాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఏ అధ్యక్షుడు లక్ష్మణ్ అనుగు సారథ్యంలో న్యూయార్క్లో, మిన్నెసోటా ప్రాంత తెలంగాణ అసోసియేషన్ (మాటా) అధ్యక్షుడు అల్లమనేని నిరంజన్ నేతృత్వంలో మిన్నెసోటాలో మహిళలు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరిపారు. మిన్నెసోటాలోని హాప్కిన్స్ హైస్కూల్లో బతుకమ్మ, దసరాను ఘనంగా నిర్వహించినట్లు నిరంజన్ తెలిపారు. కార్యక్రమంలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రవి, వజ్రసేన్ మహి, మాటా కొత్త అధ్యక్షుడు సత్రునాయక్ పాల్గొన్నారు.













