తానా బ్యాలెట్ వార్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరలో ముగుస్తుండటంతో ప్రెసిడెంట్ ఎలక్ట్ పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి, శ్రీనివాస గోగినేని తమ వ్యూహాలకు పదును పెట్టారు. వారి వారి వర్గీయులు కూడా తమ తమ పరిధిలో తమవాళ్ళ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్‌ను తానా ఓటర్లకు పంపిణీ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్లపైనే పడింది. తమ వాళ్ళకే ఓటు వేయాలంటూ ఇరు వర్గాలు ముమ్మరంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.







