ఓవర్ బుకింగ్స్… లాగిపడేశారు
ప్రయాణికుల పట్ల దురుసు ప్రవర్తనతో యునైటెడ్ ఎయిర్లైన్స్ మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అమెరికాలోని షికాగోలో ఓ ప్రయాణికుడిని ఏకంగా చేతులు, కాళ్లు పట్టుకుని ఎత్తి విమానం నుంచి లాగి పడేశారు. షికాగో నుంచి లూయిస్విల్లే వెళ్లాల్సిన యునైటెడ్ ఫ్లైట్ 3411లో పరిమితి కంటె ఎక్కువ టిక్కెట్లు బుక్యయ్యాయి. దీంతో విమాన సిబ్బంది కొందరిని విమానం నుంచి కిందకు దించేశారు. ఆసియాకు చెందినట్లుగా కనిపిస్తున్న ఓ వ్యక్తి మాత్రం విమానం దిగేందుకు నిరాకరించడంతో సెక్యురిటీ సిబ్బంది విమానంలోకి వచ్చి బలవంతంగా అతడిని లాక్కుపోయారు. చేతులు, కాళ్లు పట్టుకుని ఎత్తి తీసుకెళ్లారు. చొక్కాపైకి పోయినా, నోట్లో నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా చాలా దురుసుగా ప్రవర్తించారు. సెక్యురిటీ ప్రవర్తనతో షాక్కు గురవ్వడం మిగతా ప్రయాణికుల వంత్కెంది. ఓవర్ బుక్ చేయడం సంస్థ తప్పయినప్పటికీ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంత జరిగినా ఎయిర్లైన్స్ సీఈఓ ప్రయాణికుడికి కనీసం క్షమాపణలు చెప్పలేదు. సదరు ప్రయాణికుడు సెక్యురిటీ సూచనలు పాటించ లేదని చెప్పుకొచ్చారు.






