ఈ చిన్నారి పేరు గ్రహణం!
టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనే ఆంగ్ల అక్షరాలు దానిపైన స్మైలీ సూర్యుడు బొమ్మ ఉన్న చొక్కాతో హాయిగా అమ్మ చేతుల్లో నిద్రిస్తున్న ఈ చిన్నారి పేరు గ్రహణం. ఈ నెల 21న అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది. 99 ఏళ్ల తర్వాత అమెరికాలో ఈ ఖగోళ అద్భుతం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రీడం యూబ్యాంక్స్ అనే మహిళ సౌత్ కరోలినాలోని ఓ అస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడిన రోజున ఆ చిన్నారి పుట్టడంతో తల్లిదండ్రులు గుర్తుగా గ్రహణం అని పేరుపెట్టారు.








