అటా ఉచిత వైద్య శిబిరం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో శనివారం నాష్విల్లేలోని శ్రీ గణేశా ఆలయ ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీటీ సేవా, హిందూ కల్చరల్ సెంటర్ టేనస్సీలు సహకారం అందించాయి. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక విభాగాల్లో నిపుణులైన 25 మంది డాక్టర్లు, 10 మంది వైద్య విద్యార్థులు, 20 మంది అటా వాలంటీర్లు, 10 మంది వీటీ సేవా వాలంటీర్లు, టేనస్సీ కిడ్నీ ఫౌండేషన్ నుంచి 10 మంది ఉద్యోగులు పాల్గొని సేవలందించారు. ఈ వైద్య శిబిరానికి 100 మందికి పైగా పాల్గొని ఉచిత వైద్య సేవలు పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.













