డెట్రాయిట్ లో ఆటా వైద్య సేవలు
డెట్రాయిట్లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. డెంటల్, యోగా, మెడిటేషన్ సెషన్లను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. డెట్రాయిట్ అటా ట్రస్టీ హరి లింగాల, టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటిలో ఈకేజీ 70 డెంటల్ స్క్రీనింగ్స్ 25 ఎక్స్రేలు ఉన్నాయి. మెడిటేషన్, యోగా కార్యక్రమాలకు కూడా కొందరు హాజరయ్యారు. మొత్తం ఎనిమిది మండి డాక్టర్లు, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 20 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. అశోక్ కొండూరు, సన్నీ రెడ్డిలకు కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.













