ATA Telangana Formation Day Celebrations
పదిహేను నెలల క్రితం పురుడు పోసుకున్న ఆమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ATA) చికాగో మహా నగరంలోని స్థానిక రామదా ఇన్ బాంకెట్స్ హాల్ లో ఆమెరికా నలుమూలల నుండి వచ్చిన 500 కు పైగా సంఘ సభ్యులు పలు తెలంగాణ సంఘసభ్యులతో మరియు చికాగో నివాసులతో ఆధికారికంగా మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంది.
ఉదయం 9 గంటలకు స్థానిక Schaumburgలోని రెన్నైస్సన్స్ హోటల్ లో ఆమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ATA) కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మరియూ గత సంవత్సరము నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహా సభలలో నేర్చుకున్న పాఠాలను నెమరువేసుకొని వాటిని ఎలా సరిదిద్దుకోవాలి మరియు అంత గొప్ప జరుపోవడానికి సహకరించిన వారి అందరికి ధన్యవాదాలు తెలుపడానికి సమావేశం నిర్వహించుకుంది.
ఈ సమావేశాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభినించి, సంస్థ వ్యవస్థాపక పితామహుడు శ్రీ మాధవ రెడ్డి బొబ్బిలి గారికి, తెలంగాణప్రభుత్వ నీటిపారుదల సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గార్లకు సంతాపము మరియూ ౨నిముషాలు మౌనము పాటించారు. మొదటగా అధ్యక్షులు రామ్మోహన్కొండా గారు, కన్వీనర్ వినోద్ కుకునూర్ మరియు తోటి కార్యవర్గసభ్యులు గత సంవత్సరము నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించడానికి సహకరినించిన దాతలకు, కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కొన్ని సూచనలు సూచించారు – తెలంగాణ సంస్కృతిని/పండుగలను బావి తరాలకు చాటి చెప్పే కొన్ని కార్యక్రమాలను రూపొందించుకొని ప్రతిఏటే ప్రపంచ నలు మూలాల నిర్వహించాలని సూచించారు.
ఆమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ATA) సంస్థ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు కరుణాకర్ మాధవరం, నరేందర్ చిమర్ల, శ్రీనివాస్ రెడ్డి చాడ, సత్య కందిమళ్ల మరియుఅనివార్య కారణాల వాళ్ళ రాలేక పోయిన కళ్యాణ్ ఆనందుల గార్లు ఏకతాటి పై ఉండి ప్రస్తుత కార్యవర్గ సభ్యులను అందరిని తొలగించి, కొంతమంది ప్రస్తుత సభ్యులతో పాటు కొంత మంది కొత్త వారికీ కార్యవర్గ సభ్యులుగా స్థానం కలిపించింది. మొదటగా స్వచ్చందముగా కొత్త వారికి స్థానము కలిపించేందుకుకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కార్యదర్శి రవిఉపాధ్యాయ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో మరియు నూతన అధ్యక్షులు సత్య కందిమళ్ల గార్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగేనూతనకార్యవర్గ సభ్యులు అందరు ఏకగ్రీవంగా కార్యదర్శిగా విష్ణు మాధవరం , కోశాధికారిగా ప్రతాప్ చింతలపని, సహాయ కార్యదర్శిగా రఘుమరిపెద్ది, సహాయ కోశాధికారిగా మహీధర్ రెడ్డి, 2019-20 అధ్యక్షులుగా వినోద్ కుకునూర్, చైర్మన్ గా కరుణాకర్ మాధవరం గార్లను ఎన్నుకున్నారు.
2018 జూన్ 29, 30, జులై 1 జరుపుకునే రెండవ ప్రపంచ తెలంగాణ మహా సభలను మూడు నగరాలను పరిశీలించి చివరగా టెక్సాస్ రాష్ట్రములోని హౌస్టన్ నగరములో జరుపుకోవాడని ఏకగ్రీవంగా నిర్వహించారు. దానికి కన్వీనర్ గా బంగారు రెడ్డి గారినిఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మధ్యాన్న భోజనాన్ని చికాగో నుండి కొత్తగా కార్యవర్గ సభ్యుడుగా ఎన్నికైన కృష్ణ రంగరాజులుగారు మరియు ముందుగా విచ్చేసిన అతిథులకు సత్య కందిమళ్ల గారు శుక్రవారం రాత్రి భోజన అథిత్యలు అందించారు.
సాయంత్రము 7 గంటలకు మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ATA) సంఘసభ్యులు, పలు తెలంగాణ సంఘ సభ్యులతో మరియు చికాగో నివాసులతో ఆధికారికంగా చాలా ఘనంగా జరుపుకుంది. సంఘ నూతనఅధ్యక్షులు సత్య కందిమళ్ల జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. గణపతి ప్రార్థన మరియు అనంతరం సంస్థ వ్యవస్థాపక పితామహుడు శ్రీ మాధవ రెడ్డి బొబ్బిలి గారికి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీపాల్వాయి గోవర్ధన్ రెడ్డి గార్లకు నివాళులు అర్పించారు.
తరువాత సత్య కందిమళ్ల గారు మాట్లాడుతూ సంఘం లో అందరు కలిసికట్టుగా పనిచేయాలనీ, కన్వెన్షన్ తో పటు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా అన్ని నగరాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం అట పాటలతో, నృత్య ప్రదర్శనల తో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. ప్రవీణ్ జాలిగామ గారి నేతృత్వములో తెలంగాణపాటలతో జానపద కళాకారుడు జనార్దన్ పన్నెల తమ పాటలతో జనాల్లో జోష్ నింపారు. కూల్ మిర్చి రెస్టారెంట్ వారు రుచికరమైన రాత్రిభోజనాన్ని అందించారు. కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రవీణ్ జాలిగామ, జానపద కళాకారుడు జనార్దన్ పన్నెలను గ్యాపికలతో సత్కరించారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూరిజం అండ్ కల్చరల్ శాఖ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు.
చివరగా కరుణాకర్ మాధవరం గారు కార్యవర్గ సమావేశము మరియు మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన చికాగో కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, మిత్రులకు మరియు అథితులందరికి ధన్యవాదాలు తెలిపారు.
Satyanarayana Reddy Kandimalla
President – American Telangana Association (ATA)
WWW.ATAUSA.ORG








