ఘనంగా కింగ్ ఆఫ్ పూల్ డే వేడుకలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ప్రతీ సందర్భాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను కింగ్ ఆఫ్ పూల్స్‌గా ఎంపికచేశామంటూ ఆయన వ్యతిరేకులు న్యూయార్క్‌లో పూల్స్ డేను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సారి జరిగిన ఏప్రిల్ పూల్స్ డే పరేడ్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని ర్యాలీ నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంకు తమ భావాన్ని తెలియజేయాలన్న ఉద్దేశం ఇందులో ఉందని ర్యాలీలో పాల్గొన్నవారు మీడియాకు తెలిపారు. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ర్యాలీ ప్రారంభమై ట్రంప్ టవర్స్ వద్ద ముగిసింది.













