టీసీఎస్‌లో 11వేల ఉద్యోగాల్లో విదేశీయుల నియామకం
టీసీఎస్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో 11,500 మంది ఉద్యోగులను నియమించింది. వీరిలో అమెరికాలోని ఇంజినీరింగ్ కళాశాలలు, బిజినెస్ స్కూళ్ళనుంచి ఎంపికైన వారు ఉన్నారు. వీసా సంబంధిత సవాళ్ళను అధిగమించేందుకు ఈ నియమాకాలు చేపట్టినట్లు వెల్లడించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3.87లక్షలకు చేరింది.






