యూఎస్ నేషనల్ అకాడమీకి ఎంపికైన డా. ఓం నలమసు

అప్లయిడ్ మెటీరియల్స్ ఇన్కార్పొరేషన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఉస్మానియా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థి డా. ఓం నలమసు అమెరికాలో ఇంజనీర్ల వృత్తిపరమైన అత్యున్నత గౌరవంగా భావించే యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎన్ఎఈ)కు ఎంపికైనారు. టెక్నికల్ ఇన్నోవేషన్ స్పానింగ్ మెటీరియల్స్ డెవలప్మెంట్, అటామికల్లీ కంట్రోల్డ్ థిన్ ఫిల్మ్ ఫ్యాబ్రికేషన్, కమర్షియలైజేషన్ ఇన్మెక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ జనరేషన్ అండ్ స్టోరేజీ వంటి పలు ప్రత్యేక ఆవిష్కరణలను అందించినందుకు గుర్తింపుగా డా.నలమసు ఈ అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయకమైన ఆవిష్కరణలు మరియు ఇంజనీరింగ్ ప్రతిభను అభివృద్ధి చేయడంపై అత్యంత అభిరుచి కలిగిన వ్యక్తి ఓం అని గ్యారీ డికర్సన్, ప్రెసిడెంట్ అండ్ సీఈవో, అప్లయిడ్ మెటీరియల్స్ అన్నారు.











































































