రూ.2.3 కోట్లు పలికిన మొట్టమొదటి యాపిల్
యాపిల్ వ్యవస్థాపకులు 40 ఏండ్ల క్రితం తయారు చేసిన మొట్టమొదటి యాపిల్ కంప్యూటర్ క్రిస్టీస్ వేలంలో రూ.2.3 కోట్లుకు అమ్ముడైంది. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్ కలిసి అసెంబుల్డ్ మదర్ బోర్డులతో తయారుచేసిన 66 కంప్యూటర్లలో ఇదొక్కటే మిగిలింది. ఇందులో మదర్ బోర్డు మాత్రమే యాపిల్ తయారీ. అప్పట్లో దీని ధర 666.66 డాలర్లు కాగా, ఇప్పుడు క్రిస్టీలో పలికిన ధర 3,55,500 డాలర్లు. యాపిల్-1 అని దీనికి పెరుపెట్టారు.








