జయరామ్కోమటిని కలిసిన ఎపి టూరిజం చైర్మన్ జయరామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెపలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి. జయరామిరెడ్డి, హృదయ ఫౌండేషన్ చైర్మన్ డా. మన్నెం గోపీచంద్ మిల్పిటాస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు మాట్లాడారు. వారి రాకను పురస్కరించుకుని స్వాగత్ రెస్టారెంట్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ఎన్నారైలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై జయరామిరెడ్డి ప్రసంగించారు.








