ఉత్తర అమెరికాలో ఏపీ ప్రతినిధిగా మనోహర్ రెడ్డి
ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర్ రెడ్డిని ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది. డల్లాస్ కేంద్రంగా ఉన్న ప్యూజీ ఇన్క్ కంపెనీ సీఈఓగా ఉన్న మనోహర్‌రెడ్డి అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఆయన అక్కడ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది








