న్యూయార్క్ లో ఉన్నా ఐఫాకు హాజరు కాని అనుష్క శర్మ
బాలీవుడ్ తారల సందడితో ఐఫా 2017 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అందరు తారలతో పాటు అనుష్క శర్మ కూడా న్యూయార్క్ వెళితే ఐఫా కోసమే వెళ్లింది అనుకున్నారంతా. కానీ, ఐఫా కంటే తనకు విరాటే కోహ్లీ ముఖ్యం అంటూ న్యూయార్క్ వీధుల్లో ప్రియుడు విరాట్‌తో కలసి చక్కర్లు కొడుతుందీ భామ. గత ఏడాది తానను నటించిన యే దిల్ హై ముష్కిల్ సినిమాకు అనుష్క నామినేట్ అయినా ఐఫా ఉత్సవాలకు హాజరు కాలేదు. అది కూడా న్యూయార్క్‌లోనే ఉండి వేడుకకు హాజరు కాపోవడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.








